Allu Arjun : చిరంజీవి కుటుంబానికి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ బలపరిచిన అభ్యర్థి ప్రకాష్ రాజ్ ప్రచారంలో అల్లు ఫ్యామిలీ పాల్గొనలేదు. కనీసం ఓటు వేసేందుకు కూడా రాలేదు. మరోవైపు అల్లు కుటుంబానికి చెందిన ఆహాతో నందమూరి ఫ్యామిలీ, అటు మంచు విష్ణు కుటుంబం దగ్గరవుతోంది. ఈ క్రమంలో తాజాగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్తో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం మరింతగా పెరిగిందని అంటున్నారు.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓ వైపు అల్లు ఫ్యాన్స్ బన్నీని పొగుడుతుంటే.. మరో వైపు మెగాఫ్యాన్స్ మాత్రం అతన్ని విమర్శిస్తున్నారు. సదరు ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ కోరినట్లు బన్నీ జై పవర్ స్టార్ అనలేదు. కానీ జై బాలయ్య అన్నారు. ఇది మరింత మంది మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇక చిరంజీవి నటించిన తాజా చిత్ర ఆచార్యను డిసెంబర్ 17కు అటు, ఇటుగా విడుదల చేయాలని అనుకున్నారట. అప్పటికి పుష్ప రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయలేదు. కానీ ఆచార్య విషయం తెలిసిన బన్నీ డిసెంబర్ 17న పుష్పను రిలీజ్ చేయాలని ప్రకటించేశాడట. దీంతో మెగాస్టార్ చిరంజీవికి కోపం వచ్చి ఆయన కూడా అదే తేదీన ఆచార్యను రిలీజ్ చేద్దామని అనుకున్నారట. కాకపోతే కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న చిత్ర పరిశ్రమకు ఇబ్బందులు కలిగించడం ఎందుకని మెగాస్టార్ వెనక్కి తగ్గారట.
ఇక మొదట్లో చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చి ఆ పబ్లిసిటీ, గుర్తింపుతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనే షాడో నుంచి బయట పడాలని చూస్తున్నాడట. అందుకనే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ కాస్త దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది కేవలం తాత్కాలికమేనా.. ముందు ముందు ఈ విషయంలో ఏమైనా బయట పడతాయా ? అన్న విషయాలు వేచి చూస్తే తెలుస్తాయి.