Lawrence : తమిళ స్టార్ హీరో సూర్య.. సినిమా కథల ఎంపిక విషయంలో ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ఆకాశమే నీ హద్దురా అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ఎంతో మంచి ప్రేక్షకాదరణ తగ్గించుకుంది. తాజాగా సూర్య జై భీమ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుని ఎంతోమంది చేత ప్రశంసలు అందుకుంటోంది.
తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ తన భర్త పట్ల జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయం కోసం ఎంతో పోరాడింది. సుమారుగా 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆధారంగా చేసుకుని దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో లాయర్ పాత్రలో సూర్య ఎంతో అద్భుతంగా నటించారు.
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటుడు, దర్శకుడు లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సినిమా చూసి చలించిపోయిన లారెన్స్ నిజ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న పార్వతికి సహాయం చేశారు. ఆమె ప్రస్తుతం ఒక పూరి గుడిసెలో నివసించడం చూసిన లారెన్స్ ఎంతో ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే ఆమెకు ఒక ఇంటిని తన సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తానని మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.