కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఎటువంటి వారిపై కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందనే విషయం గురించి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో భాగంగా అధికంగా శాఖాహారులకు, ధూమపానం చేసేవారికి, O రక్త గ్రూపు ఉన్నవారికి కరోనా ముప్పు తక్కువేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 40 సీఎస్ఐఆర్ ల్యాబొరేటీల సిబ్బంది, వారి కుటుంబసభ్యులు మొత్తం 10,427 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే శాఖాహారులలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని వారు నిర్ధారించారు. శాకాహారులు తీసుకునే ఆహారంలో అధిక భాగం ఫైబర్ ఉండటం వల్ల ఇది కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
A,AB రకం రక్త గ్రూపు వారితో పోలిస్తే O రకం రక్త గ్రూప్ వారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశం తక్కువ అని వెల్లడించారు. కరోనా శ్వాస వ్యవస్థ పై దాడి చేసే వ్యాధి అయినప్పటికీ శ్లేష్మం ఉత్పత్తిని పెంచటంలో ధూమపానం వాటిని రక్షించడంలో ముందువరుసలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.కరోనా సంక్రమణపై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.