Janhvi Kapoor : బాలీవుడ్ సెలబ్రిటీల కుమార్తెలు, కొడుకులు.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా సరే.. ట్రోల్ చేసేందుకు నెటిజన్లు సిద్ధంగా ఉంటారు. అయితే తాజాగా సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌లు వేసిన ట్రిప్ తాలూకు ఫొటోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ రీతిలో స్పందన లభిస్తోంది.
సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ ఎప్పుడూ గ్లామరస్ ఫొటోషూట్‌లు చేస్తూ.. విహారాలు చేస్తూ.. హాట్ ఫొటోలను తమ సోషల్ ఖాతాల్లో పెడుతుంటారు. దీంతో నెటిజన్లు విమర్శిస్తుంటారు. అయితే ఈసారి వారు భిన్నంగా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించి దాని తాలూకు ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.
https://twitter.com/Saratimes95/status/1454768529362743301
వారిద్దరూ కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న అనంతరం అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిల్లో వారు సాధారణ దుస్తులు ధరించి, మేకప్ లేకుండా ఉన్నారు. దీంతో ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించేవారు.. సాధారణ లుక్‌లో కనిపించే సరికి.. నెటిజన్లు షాకవుతున్నారు. వారి ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించినందుకు వారిని కొందరు అభినందిస్తుంటే.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
https://twitter.com/Saratimes95/status/1455059057018953728
ఇక జాన్వీకపూర్, సారా అలీ ఖాన్ ఇద్దరూ ఇటీవల రణవీర్ సింగ్ క్విజ్ షో ది బిగ్ పిక్చర్ లో కనిపించి సందడి చేశారు. సారా అలీ ఖాన్ అత్రంగీ రే మూవీలో నటించగా.. అందులో అక్షయ్, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. జాన్వీ కపూర్ ఇటీవలే నటించిన రూహీ మూవీ విడుదల కాగా.. త్వరలో గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2 అనే మూవీల్లో కనిపించనుంది.
https://twitter.com/janhvisgiggle/status/1454759043763884040