Allu Arjun : టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విలక్షణమైన పాత్రల్లో నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రజంట్ అల్లు అర్జున్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారట. అది కూడా అల్లు అర్జున్ ను నెగెటివ్ రోల్ లో ప్రజంట్ చేస్తారనేది టాక్.
తన కొడుకుతో ఓ షార్ట్ ఫిల్మ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సలహాలతో ఓ దర్శకుడితో మాట్లాడారట. ఈ క్రమంలో ఆ డైరెక్టర్ కూడా షార్ట్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే కంటెంట్ సొసైటీకి మెసేజ్ అందించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ కథలో స్నేహా రెడ్డి సూచనలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ఈ కథ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ ఉద్యోగం చేసే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందుల్ని చూపిస్తారట. ప్రస్తుతం ఎంతోమంది భార్యాభర్తలు తమ ఉద్యోగం బిజీలో పడి పిల్లల సంరక్షణతోపాటు వారితో టైమ్ స్పెండ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. అలాంటి సన్నివేశాల్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపిస్తారట. పేరేంట్స్, పిల్లల విషయంలో ఎలా ఉండాలనేది తెలియజేయాలనే క్రమంలో అందించే మెసేజ్ ఒరియెంటెడ్ షార్ట్ ఫిల్మ్.
ఈ కథకు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ కథ ఎప్పుడు షూటింగ్ దశకు చేరుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాకి డైరెక్టర్ గా వంశీ పైడిపల్లిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.