Chiranjeevi : గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలకు విపరీతమైన హైప్ వచ్చింది. దీంతో ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు, మద్దతుదారులు కాస్తంత హద్దులు దాటారనే చెప్పవచ్చు. అయినప్పటికీ మంచు విష్ణు మాత్రం అన్నింటికీ కౌంటర్ ఇస్తూ కూల్‌గా ముందుకు సాగాడు.
అయితే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోతారని చిరంజీవికి ముందే తెలుసని.. ఓవార్త చక్కర్లు కొడుతోంది. అందుకు ఆయన పెళ్లిసందడి ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలే కారణం. అప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు. అయినా ఆయన ఎన్నికల తరువాత ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా.. అందరం కలిసే ఉండాలని, ఇవి చిన్న ఎన్నికలని, అనవసరంగా గొడవలు పడి మా పరువు తీయొద్దని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోతారని మెగాస్టార్ ముందే ఊహించారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు కేవలం నాగబాబు మాత్రమే మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. అల్లు అర్జున్ అయితే పోలింగ్ కు దూరంగా ఉన్నారు. అంటే.. ప్రకాష్ రాజ్ ఓడిపోబోతున్నారని.. అప్పుడే వారికి అర్థమై ఉంటుందని, అందుకని అనవసరంగా ఆయనకు మద్దతు ఇచ్చి అభాసు పాలు కావడం ఎందుకని.. అప్పుడే వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చి ఉంటే ఆయన ఎలాగూ ఓడిపోతారు కనుక.. మంచు విష్ణు ఫ్యామిలీతో స్నేహం పోతుంది. వారికి వైసీపీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఉంది కనుక ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చి భంగపడడం ఎందుకని.. ముందుగానే ఊహించిన మెగాస్టార్ ఈ ఎన్నికలకు ఆయన మాత్రమే కాకుండా, తన ఫ్యామిలీని కూడా దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.