Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని పాన్ ఇండియా రెబల్ స్టార్ గా మారారు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్ లో సినిమాను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా టైటిల్ ను స్పిరిట్ గా ఖరారు చేసి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు. ఈ సినిమాని ప్రభాస్ 25వ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ సినిమాల లిస్ట్ లోకి మరో రెండు సినిమాలు యాడ్ అయ్యాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ సినిమాకి డైరెక్షన్ వహించేది ప్రశాంత్ నీల్. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎస్ ఫిల్మ్ మేకర్స్ తో ప్రభాస్ కు ఇది సెకండ్ మూవీ. ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ మరో పవర్ ప్యాక్డ్ కథను సిద్ధం చేస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ తో వస్తున్న సినిమా హెవీ యాక్షన్ మూవీ. ఈ రెండు సినిమాల్ని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ సినీ కెరీర్ ని మరో రెండు మూడేళ్ళ వరకు సినిమాలతో ఫుల్ బిజీగా మార్చేసుకున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.