Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజులుగా పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆయన ఎఫ్3 మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు. ఆ సందడికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. తాజాగా శంకర్ పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సందడి చేశారు.
జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసిన అల్లు అర్జున్ దాని రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ అనంతరం తహసీల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.
కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతోంది.
https://twitter.com/MilagroMovies/status/1446355971157069824
దాక్కో దాక్కోమేక తర్వాత రెండో సింగిల్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న.