Viral Video : తేనె ఎంతో తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తేనెను ఎంతో ఇష్టంగా తింటారు. ఆయుర్వేద వైద్యంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో పలు రకాల ఔషధాలను తయారు చేయవచ్చు. తేనెను రోజూ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే తేనెను ఎలా సేకరిస్తారో కూడా అందరికీ తెలిసిందే. తేనె పట్టు నుంచి తేనెను తీస్తారు.
తేనెటీగలను కొందరు ఫామ్‌లలో పెంచి అవి పెట్టే పట్టు నుంచి తేనెను సేకరించి దాన్ని విక్రయిస్తారు. ఇక మనకు అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లకు సహజసిద్ధంగా తేనెతెట్టెల నుంచి కూడా తేనె లభిస్తుంది. అయితే ఇలాగే ఒక వ్యక్తి తేనె సేకరించాడు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం అందరికీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఎందుకంటే చుట్టూ తేనెటీగలు ఉన్నా కూడా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా తేనెను తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మను రెండుగా చీల్చగా అందులో తేనె తెట్టె కనిపించింది. దాన్నుంచి అతను తేనెను తీశాడు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ వ్యక్తి తేనె సేకరించడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కానీ అతనికి అది అలవాటే అని ఆ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తేనెటీగలను డిస్టర్బ్ చేసి తేనెను ఎందుకు సేకరిస్తున్నావు.. అని కొందరు జంతు ప్రేమికులు కామెంట్స్ చేయగా.. అతను సమాధానం చెప్పాడు.
ఇది పరిశుద్ధమైన తేనె. నేను తేనెటీగలను చంపలేదు. అవి మళ్లీ తెట్టె పెట్టి జీవిస్తాయి. నేను వాటికి ఎలాంటి హాని కలగజేయలేదు.. అని రిప్లై ఇచ్చాడు. కాగా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ తేనె కావాలని కోరగా.. ఆ వ్యక్తి తన ఫోన్ నంబర్‌ను సైతం షేర్ చేయడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…