ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలను డ్రోన్ల సహాయంతో చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు మనం ఎప్పుడూ చూడని వింతైన, ఆశ్చర్యం కలిగించే వీడియోలను ప్రస్తుతం చూడగలుగుతున్నాము. ఇలా డ్రోన్ సహాయంతో ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలిని చిత్రీకరిస్తున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ మొసలి వేటాడిన తీరుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి దాని చేతికి దొరికామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ క్రమంలోనే మొసలి వేట మొదలు పెడితే ఎంతో చాకచక్యంగా కేవలం కనురెప్పపాటు కాలంలోనే ఇతర జంతువులు, మనుషులపై దాడి చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా మొసలి ఈ విధంగానే వేటాడింది. అయితే అది వేటాడినది ఏ పక్షినో జంతువునో కాదు, ఒక డ్రోన్ ను.
ఫ్లోరిడాలో రికార్డు చేసిన వీడియోను డ్రోన్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో డ్రోన్ సహాయంతో నీటిలో ఉన్న మొసలిని చిత్రీకరించాలని భావించాడు. ఈక్రమంలోనే డ్రోన్ మొసలి దగ్గర చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే ఆ మొసలి ఏదైనా పక్షి అనుకుందో ఏమో కానీ కనురెప్ప పాటు కాలంలో తనపై ఎగురుతున్న డ్రోన్ ను ఒక్కసారిగా పట్టుకొని నమిలింది. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న మరొక వ్యక్తి కెమెరాలో షూట్ చేస్తున్నాడు. ఒక్కసారిగా మొసలి డ్రోన్ ను మింగడంతో దాని నోట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు మూగ జంతువుల దగ్గర ఇలాంటి ప్రయత్నాలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…