ఆంబులెన్స్‌లు అనేవి అత్యవసర వాహనాలు. ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి ఉంటే వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆంబులెన్స్‌లలో హాస్పిటల్స్ కు తరలిస్తుంటారు. అందువల్ల ఆంబులెన్స్ లకు ఎవరైనా సరే దారివ్వాల్సిందే. కానీ ఈ విషయంపై కూడా అవగాహన లేని, కనీస జ్ఞానం లేని ఓ వ్యక్తి ఆంబులెన్స్‌కు దారివ్వలేదు. అయితే చివరకు అతను కటకటాల పాలయ్యాడు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా తొక్కొట్టు, పంప్‌వెల్ మధ్య జాతీయ రహదారి-66పై తాజాగా ఓ ఆంబులెన్స్ ప్రయాణించింది. దాని ముందట ఓ వ్యక్తి కారులో ప్రయాణించాడు. అయితే అతను ఆంబులెన్స్‌కు దారివ్వలేదు. పదే పదే ఆంబులెన్స్ కు అడ్డుగా వచ్చాడు. అదే సమయంలో కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే ఆ వీడియో ఆధారంగా మంగళూరు పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతన్ని చరణ్ (31) అనే వ్యక్తిగా గుర్తించారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 279, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 194(ఇ) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే అతను కారు ఎందుకు అలా డ్రైవ్ చేశాడు, మద్యం ఏమైనా సేవించాడా ? అన్న వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియా వల్ల ఒక వ్యక్తి అలా పట్టుబడడం అభినందించదగిన విషయం..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…