ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడో జరిగే వీడియోలు ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తోంది. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక ఉడుత, ఒక విషపూరితమైన పాము మధ్య జరిగిన భయంకరమైన పోరాటం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎక్కడో ఒక ఉడుతని చూసిన పాము ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. ఈ విధంగా పాము దాడి చేయడంతో దాని నుంచి తప్పించుకున్న ఉడుత ఏ మాత్రం భయపడకుండా తిరిగి పాముపై దాడి చేసింది.
There are battles we don't know about.#صباح_الخير pic.twitter.com/M1HhpKUlD6
— existing in nature (@afaf66551) February 18, 2021
ఈ విధంగా ఈ రెండింటి మధ్య ఎంతో భయంకరమైన పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఉడుత పాముపై దాడి చేస్తూ పామును తీవ్రంగా గాయపరిచింది. ఈ పోరాటంలో చివరికి ఉడుత విజయం సాధించగా పాము ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నదైనా ఉడుత ఎంతో ధైర్యంతో పాముతో పోరాడటం చూసి ఆశ్చర్యపోతున్నారు.