కరోనా నేపథ్యంలో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా, అధికారులు ఎంత విజ్ఞప్తి చేస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. దీంతో అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పూణెలో మాస్క్ ధరించకుండా వెడ్డింగ్ ఫోటో షూట్ చేసిన ఓ వధువు సహా ఆ ఫోటోషూట్‌ను నిర్వహించిన అందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
పూణెలోని డైవ్ ఘాట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఫేస్ మాస్క్ లేకుండా కారు బోనెట్ మీద ఓ వధువు కూర్చుని వివాహ ఫోటోషూట్ చేసింది. అయితే ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఆ వధువుపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ కారు డ్రైవర్, కెమెరామెన్‌తో సహా అక్కడ ఉన్నవారందరిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 269, 188, 279, 107, 336, 34 సెక్షన్లతో పాటు విపత్తు నిర్వహణ చట్టం, మహారాష్ట్ర కోవిడ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, మోటారు వాహనాల చట్టం వంటి ఇతర సంబంధిత విభాగాలతో పాటు పోలీసులు నిందితులందరిపై కేసులు నమోదు చేశారు.
ఇక షూట్ కోసం ఉపయోగించిన కెమెరాను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ రాష్ట్రం దేశంలో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో నంబర్ వన్ స్థానంలో ఉంది.. రెండవ వేవ్ ఏప్రిల్‌లో ఒకే రోజులో 67,000 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే తగ్గుతున్న కేసుల దృష్ట్యా రాష్ట్ర లాక్ డౌన్ పరిమితులు తగ్గించబడ్డాయి. కానీ ప్రజలు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మాస్కులను ధరించకపోతే అక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…