ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆసుపత్రిలో చేరే బాధితులకు కనీసం బెడ్ దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఒకవేళ బెడ్ దొరికినప్పటికీ వారికి ఆక్సిజన్ దొరకాలంటే అది ఒక అదృష్టంగా భావించాలి.ఈ విధంగా సరైన సమయంలో వైద్యం అందక ఎంతోమంది బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. మనదేశంలో మనుషులకే ఆక్సిజన్ దొరకక కొట్టుమిట్టాడుతుంటే థాయిలాండ్ లో మాత్రం ఏకంగా బొద్దింకలను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కనిపించింది.ఆ యువకుడు ఆ బొద్దింకను చూసి తన చేతులను అంబులెన్సులుగా మార్చి అక్కడి నుంచి వెంటనే సరైన చికిత్స కోసం సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు కూడా ఇదేంటని ప్రశ్నించకుండా వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సరైన వైద్యం అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే డాక్టర్ మాట్లాడుతూ బొద్దింక బ్రతకడానికి సగం మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆపదలో ఉన్న బొద్దింకలు రక్షించాలని ఆ యువకుడికి కలిగిన ఆలోచన పై డాక్టర్ ప్రశంసలు కురిపిస్తూ ఇప్పటివరకు తన సర్వీసులో ఈ విధంగా బొద్దింకకు చికిత్స చేయమని ఎవరు రాలేదనే విషయాన్ని తెలియజేశారు.క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఈ బొద్దింకకు ఆక్సిజన్ అందించాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న పని అందుకోసమే బొద్దింకను ఆక్సిజన్ కంటైనర్లో పెట్టినట్టు డాక్టర్ తెలిపారు. బొద్దింక కోలుకున్న తర్వాత తన ఆరోగ్యం యువకుడి చూసుకోవాలని డాక్టర్ చెప్పగా అందుకు యువకుడు కూడా అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స తీసుకుంటున్న బొద్దింక పరిస్థితి ఏవిధంగా ఉంది అది బ్రతికిందా?లేక చనిపోయిందా? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ బొద్దింకకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…