గత కొద్ది రోజుల క్రితం “బచ్ పన్ కా ప్యార్ హై” అంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో అనే బాలుడు పాఠశాలలో ఈ పాటను పాడిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాట ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బుడ్డోపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఈ బుడ్డోడిని పిలిపించుకొని మరి పాట పాడించుకుని విన్నారు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఈ పాట తనకు నిద్రలేకుండా చేస్తోందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ విధంగా ఈ పాటని ఎంతో అద్భుతంగా ఉండటంతో ఈ పాటకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా హసదేవ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బుడ్డోడు పాడిన పాటకు ఫిదా అయినటువంటి ఎంజీ కంపెనీ ఆ బుడ్డోడికి ఏకంగా 23 లక్షల విలువచేసే కారును బహుమతిగా ఇచ్చినట్టు ఆ కారుకు సంబంధించిన కీస్ చిన్నారి చేతికి అందించినట్టు ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలోనే సదరు కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హసదేవ్ డిర్డో ఎంజీ కంపెనీ నిర్వహించిన ఓ డీలర్‌షిప్‌ఈ కార్యక్రమానికి వచ్చాడు ఈక్రమంలోనే కారు ముందు ఫోటో దిగారు అంతేకానీ తనకు ఎలాంటి కారు బహుమతిగా ఇవ్వలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందుకు గాను హసదేవ్ డిర్డో కి కేవలం ఇరవై ఒక్క వేల రూపాయలను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…