మనం మన పరిసరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకు ప్రమాదం ఎటు వైపు నుంచి వస్తుందో అస్సలు తెలియదు. ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో బతికి బట్టకట్టడం చాలా అరుదుగానే జరుగుతుంది. వెంట్రుక వాసిలో తప్పిపోయింది అంటారు కదా.. అలాగన్నమాట. జీవితంలో ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో ఇలా జరుగుతుంటుంది. ఆ బాలుడి విషయంలోనూ అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఓ చిన్న డబ్బా కొట్టులోకి ఓ బాలుడు ప్రవేశించేందుకు యత్నించాడు. చూస్తే అతను బయటకు ఏదో పని కోసం వెళ్లి తిరిగి తన డబ్బాలోకి వచ్చేందుకు యత్నించాడు. పై నుంచి ఎక్కి లోపలికి వెళ్లబోయాడు. అయితే అప్పటి వరకు అతను ఫోన్‌ను చూస్తూ ఉంటూ సడెన్‌గా డబ్బాలో పైకి చూశాడు. అంతే.. వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
అతను వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఓ తాచు పాము అతను ఉండాల్సిన చోట కింద పడింది. చూస్తే అది ఓ ఎలుకను తరుముతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. అయితే కొన్ని సెకన్లు అతను అక్కడే ఉండి ఉంటే అతను పాము కాటుకు గురవ్వాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. చివరి నిమిషంలో అతను పైకి చూడబట్టి ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పక్కకు తప్పుకున్నాడు. లేదంటే పాము కాటుకు అతను బలై ఉండేవాడు.
కాగా ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ బాలుడికి అదృష్టం ఉందని లేదంటే ప్రాణాలు పోయి ఉండేవని కామెంట్లు చేస్తున్నారు. అవును.. నిజంగా అతనికి లక్ ఉందనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…