అదృష్టం ఎప్పుడు ఎవరో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు రాత్రికి రాత్రే ఎంతోమంది కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. అలాంటి వారిలో దక్షిణ కొరియా నివాసి ఒకరని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఒక ఫ్రిజ్ కొనాలని భావించి, ఆన్లైన్లో ఫ్రిజ్ బుక్ చేశాడు.అయితే ఆ ఫ్రిడ్జ్ అతనిని కోటీశ్వరుడిని చేసింది. అసలు ఏం జరిగిందంటే..
దక్షిణ కొరియాలోని జెజు ద్వీప నివాసి ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ ఫ్రిజ్ డెలివరీ కావడంతో దానిని శుభ్రం చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆ ఫ్రిజ్ దిగువ భాగంలో ఓ అట్టముక్క అంటించి ఉండటం గమనించిన ఆ వ్యక్తి ఆ అట్ట ముక్కను తీసి చూసి ఎంతో ఆశ్చర్యపోయారు.1.30 లక్షల డాలర్ల (సుమారు 96 లక్షల రూపాయలు) విలువైన నోట్ల కట్టలు ఉండడంతో ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఈ క్రమంలోనే ఫ్రిడ్జ్ కింది భాగంలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకగా వెంటనే ఆ డబ్బులను పోలీసులకు అప్ప చెప్పాడు. అయితే దక్షిణ కొరియా చట్ట ప్రకారం దొరికిన డబ్బులో 22 శాతం ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. డబ్బులు పోగొట్టుకున్నట్టు డబ్బు కోసం ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే ఆ డబ్బు మొత్తం దొరికిన ఆ వ్యక్తికే చెల్లుతుంది. ఈ విధంగా ఆ డబ్బును తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో సదరు వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.