Sleep : మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలను అనుసరించి మనం నిద్రపోతే చక్కటి ఫలితం కనబడుతుంది. అయితే ఎప్పుడైనా మీరు పండితులు చెప్పడాన్ని వినే ఉంటారు. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు అని. అయితే అసలు ఎందుకు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరం వైపుగా తల పెట్టుకుని నిద్రపోవడం వలన చెడు కలలు వస్తాయని, మనసుని దెబ్బతీసేలా ఉంటాయని అంటారు.
ఉత్తరం వైపు నిద్రపోతే పాజిటివ్ ఎనర్జీని కోల్పోతారు కూడా. పూర్వీకుల నుండి కూడా ఇలా చెప్పడం జరుగుతోంది. అయితే ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎందుకు నిద్రపోకూడదు అనే విషయానికి వచ్చేస్తే.. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వలన సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్లయితే, రక్తప్రసరణకి ఆటంకం అవుతుంది. నిద్రలో ఆటకం ఏర్పడుతుంది. కాబట్టి అలా నిద్రపోకూడదని అంటారు. ఎనర్జీ లెవెల్స్ కూడా ఉత్తరం వైపు నిద్రపోవడం వల్ల తగ్గిపోతాయి.
ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే పార్వతీ దేవి స్నానానికి వెళ్ళినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రాకుండా చూసుకోమని చెప్తుంది. వినాయకుడికి శివుడు పార్వతీ దేవి భర్త అని తెలిసినా శివుడిని లోపలికి వెళ్ళకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. పార్వతీ దేవి బయటకి వచ్చేసరికి శివుడు, గణపతి గొడవ పడుతూ ఉంటారు.
శివుడికి కోపం వచ్చి వినాయకుడి తల నరికేస్తాడు. పార్వతీ దేవి ఆగ్రహానికి లోనై తన బిడ్డను తిరిగి కాపాడాలని మొండిపట్టు పడుతుంది. శివుడు ఆదేశించగా అతని భటులు ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక ఏనుగుని చూస్తారు. ఆ ఏనుగు తల నరికి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరం వైపు పడుకున్న వాళ్ళ తలని తీసుకున్నారని, ఇలా ఈ దిశలో పడుకోకూడదని చెప్తూ ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…