Stars : నక్షత్రాలని బట్టీ మనం ఎవరి స్వభావం ఎలాంటిది..? భవిష్యత్తులో ఎవరికీ బాగుంటుంది అనేది చూద్దాం. అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం. నీతిమంతులు, ప్రియమైన భాష కలిగిన వారు. చక్కని రూపం కలవారు. కానీ ఈ నక్షత్రానికి చెందినవారు అనవసరమైన విషయాల్లో అప్పుడప్పుడు దృష్టి సారిస్తారు. సమాజంలో గౌరవం పొందాలని చూస్తారు. భరణి నక్షత్రం మానవ గణ నక్షత్రం. వీళ్ళు ఆరోగ్యవంతులు, సుఖవంతులు. పరిస్థితులకి అనుకూలంగా మార్చుకుంటారు. కృతిక నక్షత్రం రాక్షస గణముల కలవారు. వీళ్ళు పేరు, ప్రత్యేకతల్ని పొందుతారు. రోహిణి నక్షత్రం మానవ గణముల కలవారు సత్యవంతులు. శుభ్రత ఎక్కువ.
మృగశిర నక్షత్రం దేవగణ నక్షత్రం. వీళ్ళెప్పుడు ఉత్సాహంగా ఉంటారు. స్నేహితుల్ని బాగా ఆదరిస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం కలవారు సొంత వారిపై ఎప్పుడూ ప్రేమని కురిపిస్తారు. జ్ఞాపకశక్తి వీళ్ళకి ఎక్కువ. పునర్వసు నక్షత్రం వాళ్లు మంచి స్వభావులు. అల్ప సంతోషులు. పుష్యమి నక్షత్రం వాళ్లు శాంత స్వభావం కలవారు. బాల్యం నుండి యవ్వనం వరకు ఎంతగానో కష్టపడి మంచి స్థాయికి వస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సున్నిత మనస్కులు. రాక్షస గానము కనుక ఎక్కువ పట్టుదల, పగతో వీళ్ళు ఉంటారు.
మఖ నక్షత్రం వాళ్లు పితృభక్తులు. ధనవంతులు. రాక్షస గణము కనుక పట్టుదల, ప్రతీకారం ఎక్కువ. పుబ్బ నక్షత్రం వారు సౌమ్యులు. దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఉత్తర నక్షత్రం వాళ్లకి వారి తండ్రి వలన ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్లు ఉత్సాహవంతులు. ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు వీరి జీవితంలో ప్రధాన ప్రస్తావనవుతాయి.
చిత్త నక్షత్రం వారు రాక్షస గణానికి చెందినవారు. వీళ్లు జీవితంలో అనుభవించిన కష్టాలు ఎవరు అనుభవించకూడదని చూస్తారు. స్వాతి నక్షత్రం వారు మేధావులుగా, అధికారులుగా రాణిస్తారు. ధార్మికత, సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం వారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా పెరుగుతారు. వైద్య, వ్యాపార సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. అనురాధ నక్షత్రం వారు వృద్ధులు, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారు. విద్యలో కూడా రాణిస్తారు.
జేష్ట నక్షత్రం వారికి కోపం ఎక్కువ ఉంటుంది. శక్తి లేకపోయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మూల నక్షత్రం వారు లక్ష్మీ పుత్రులు. కుటుంబం కొరకు తల్లిదండ్రుల కొరకు కొంత దాకా త్యాగం చేస్తారు. పూర్వాషాడ నక్షత్రం వాళ్ళు కళల పై ఆసక్తి చూపిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరాషాడ నక్షత్రం వారు కృతజ్ఞతతో ఉంటారు. వీళ్ళది మనుష్య గుణం. ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్నా మంచి స్థాయికి చేరుకుంటారు.
శ్రావణ నక్షత్రం కలవారు అంతర్గత ఆలోచన, మేదస్సు తో ఉంటారు. ఎవరికి అర్థం కారు. మనోధర్యంతో నిర్ణయాలని తీసుకుంటారు. ధనిష్ట నక్షత్రం వారు మంచి బుద్ధిని కలిగి ఉంటారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. శతభిష నక్షత్రం వారు ఎగుమతి వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. అన్ని మార్గాల్లోని స్నేహితులు వీళ్ళకి ఉంటారు.
పూర్వభద్ర నక్షత్రం కలవారు ధనవంతులు. దాతలు. అనేక రంగాల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. పెద్దల మీద గౌరవం, భయం ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు గొప్పలు చెప్పుకోరు. ఇతరులని కించపరచురు. చదువు మీద మంచి పట్టు ఉంటుంది. రేవతి నక్షత్రం వారు ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలు చెప్తారు. దూర ప్రాంతాల్లో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం అందుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…