మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. భూమిపై ఇవి ప్రభావం చూపిస్తాయి. గ్రహాలు, నక్షత్రాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. అయితే రాశులలో ఉండే గ్రహాల ప్రభావాన్ని చూసి ఎలా మనిషికి ఇబ్బందులు కలగబోతున్నాయి..? శుభాలు జరగబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం ఏ రాశి వారికి ఏ శరీర భాగాన్ని చూసి శుభ, అశుభ ఫలితాలను చెప్పచ్చనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మరి మీ రాశి వారికి ఏ అవయవ భాగము లగ్నము నుండి చూడచ్చో చూసేయండి.
ముందు మేషరాశి వారికి చూస్తే.. ఈ రాశి వారికి శిరస్సు, మెదడును చూడాలి. వృషభరాశి వారికి అయితే ముఖాన్ని, గొంతు, మెడ, టాన్సిల్స్, కళ్ళు, ముక్కు, నాలుక, వేళ్ళగోళ్లని చూడాలి. మిధున రాశి వాళ్లకి అయితే ఉదరాన్ని, చేతులు, చెవులని చూడాలి. కర్కాటక రాశి వాళ్లకి అయితే హృదయం, స్తనాలు, ఊపిరితిత్తులు చూసి చెప్పవచ్చు. సింహ రాశి వాళ్లకి అయితే పొట్ట, గుండె, వెన్నుపూస చూడాలి.
కన్యా రాశి వారికి అయితే నడుము, చిన్నప్రేవులు, ఆహారనాళం చూడాలి. తులారాశి వాళ్లకి పొత్తికడుపు, మూత్ర పిండాలు చూడాలి. వృశ్చిక రాశి వాళ్లకి జననాంగాల(బాహ్య జననేంద్రియాలు)ని చూడాలి. ధనస్సు రాశి వారికి తొడలు ,తుంట చూడాల్సి వుంటుంది. మకర రాశి వాళ్లకి మోకాళ్ళు చూడాలి. కుంభరాశి వారికి పిక్కలు, చీలమండలు చూడాలి. మీన రాశి వారికి పాదాలు చూడాలి.
అదే గ్రహాల విషయానికి వస్తే.. రవికి శిరస్సు, హృదయం, కుడికన్ను, ఉదరం, ఎముకలు. చంద్రుడుకి ఎడమ కన్ను, శరీరంలోని ద్రవాలు, స్త్రీల పునఃఉత్పత్తి అంగాలు చూడాల్సి వుంటుంది. గురువుకి కాలేయం, పిత్తకోశం, చెవి, శుక్రుడుకి ముఖం, పునః ఉత్పత్తి అంగాలు, వీర్యం, ప్రేగులు, శనికి కాళ్ళు, పాదాలు, కుజుడుకి ఎముకలలో మజ్జ, రక్తం, పిత్తం, మెడభాగం, బుధుడుకి గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు చూడాల్సి ఉంటుంది. ఇలా ఆయా రాశులు, ఆయా గ్రహాలకు మన శరీరంలోని పలు భాగాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయి. దీన్ని బట్టి జాతక ఫలితాలు ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…