Scissors : మన ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని వస్తువులల్లో కత్తెర కూడా ఒకటి. ఇది దాదాపు అందరి ఇండ్లల్లో ఉంటుందని చెప్పవచ్చు. అనేక రకాలుగా మనం కత్తెరను వాడుతూ ఉంటాము. అయితే ఇంట్లో ఈ కత్తెరను మనం ఎక్కడపడితే అక్కడ ఉంచుతూ ఉంటాము. కానీ కత్తెరను తప్పుడు దిశలో ఉంచడం వల్ల కూడా మన జీవితంలో సమస్యలు తలెత్తుతాయని మీకు తెలుసా..! అవును మీరు విన్నది నిజమే. కత్తెరను తప్పుడు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గవు. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో పాటు పిల్లలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. కత్తెర ఒక పదునైన వస్తువు. ఇది కేతువు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ జాతకంలో గనుక కేతువు చెడుగా ఉంటే, మీరు ఇంట్లో కత్తెర వంటి పదునైన వస్తువులను సరైన దిశలో ఉంచడం మంచిది.
ఇంట్లో కత్తెరను సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందంగా ఉండడంతో పాటు పిల్లలకు కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా తప్పు పట్టిన కత్తెర, బ్లేడ్లు, కత్తులు వంటి వాటిని కూడా ఇంట్లో ఉంచకూడదు. తుప్పు పట్టిన ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కేతువు చెడిపోతుంది. కనుక వీటిని వెంటనే బయటపడేయడం మంచిది. మంచిగా ఉండే కేతువు జీవితంలో శాంతిని ఇవ్వడంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇక కత్తెరను ఉంచడానికి సరైన దిశ నైరుతి దిశ. కత్తెరతో పాటు పదునైన వస్తువులను, టూల్ బాక్స్ వంటి వాటిని కూడా ఈ దిశలోనే ఉంచాలి. నైరుతి దిశతో పాటు వాయువ్య దిశలో కూడా వీటిని ఉంచవచ్చు. వీటిని ఎల్లప్పుడూ బాక్స్ లలో లేదా కవర్లల్లో ఉంచాలి. వీటి మొన బయటికి కనిపించేలా మాత్రం వేలాడదీయకూడదు. ఇలా సరైన దిశలో ఉంచబడిన వస్తువులు జీవితంలో సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
పిల్లల భవిష్యత్తులో పురోగతి ఉంటుంది. ఇక కత్తెరను మాత్రం ఈశాన్య దిశలో అస్సలు ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో అశాంతి, ఒత్తిడి, ఆందోళన నెలకొంటుంది. ఇంట్లో వారి సంబంధాలపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అలాగే కత్తెరను పడమర దిశలో కూడాఉంచకూడదు. ఈ దిశలో ఉంచడం వల్ల తల్లి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…