Rahukalam : ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇది రాహుకాలం అని, ఇది మంచి వేళ కాదని ఏదో ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థం కాదు. అయితే రాహుకాలంలో ఏం చేయొచ్చు, శుభకార్యాలు చేయకూడదా, ఇది నిజంగా చెడు సమయమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. రాహుకాలంని చెడు సమయంగా భావిస్తారు. అందుకే రాహుకాలంలో ప్రయాణం చేయకూడదంటారు. వ్యాపారం వంటివి మొదలు పెట్టకూడదంటారు. కొత్త పనులను కూడా రాహుకాలంలో మొదలుపెట్టరు.
పెళ్లిళ్లు వంటివి కూడా రాహుకాలంలో చెయ్యరు. శాస్త్రం ప్రకారం చూసినట్లయితే శుభకార్యాలు ఏమైనా చేయాలంటే శుభముహూర్తంలోనే చేస్తారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కాలాన్ని మొత్తం ఎనిమిది భాగాలుగా విభజించారు. ఇందులో ఒకటి రాహుకాలం. అయితే ఈ రాహుకాలం అనేది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. సుమారు ఈ రాహుకాలం 90 నిమిషాల నుండి గంటన్నర వరకు ఉంటుంది.
ప్రతిరోజూ ఇది ఒకలా ఉండదు. సమయాన్ని బట్టి మారిపోతుంటుంది. సోమవారం పూట రెండో భాగంలో, శనివారం నాడు మూడో భాగంలో, శుక్రవారం నాడు నాలుగో భాగంలో, బుధవారం ఐదో భాగం, గురువారం ఆరో భాగం, మంగళవారం అయితే ఏడవ భాగం, ఆదివారం 8వ భాగంలో ఇది వస్తుందట. రాహుకాలంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చెయ్యరు. చెడు సంకేతంగా దీనిని భావిస్తారు.
రాహువు సూర్యుడిని మింగే పాము. అందుకని చెడు సంకేతంగా దీన్ని పరిగణిస్తారు. రాహుకాలంలో రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందట. రాహుకాలంలో విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు, ఇల్లు అమ్మడం, కొనడం, బంగారు ఆభరణాలను కొనడం, ఇంటి గృహప్రవేశం వంటివి చేయకూడదు. కొత్త పనులు మొదలు పెట్టకూడదు. పెళ్లి, నిశ్చితార్థం వంటి వేడుకలని కూడా చేయకూడదు. కానీ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి రాహుకాలమే మంచి ఫలితం ఇస్తుందట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…