Navagraha : గ్రహాలు అనుకూలంగా ఉంటే అన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. అన్ని పనులు కూడా పూర్తవుతాయని చాలా మంది భావిస్తారు. నవగ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. రవిచంద్రులు అనుకూలంగా ఉండాలంటే తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులని బాగా అర్థం చేసుకోవాలి. బాగా చూసుకుని బాగా సేవ చేయాలి. అదే గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. రోజూ పసుపుని పాలతో కలిపి నుదుటిన బొట్టు పెట్టుకుంటే గురు బలాన్ని పొందొచ్చు. ఆడవాళ్లు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. అప్పుడు కూడా గురుబలాన్ని పొందవచ్చు.
శుక్ర గ్రహం అనుకూలంగా ఉండాలంటే ఇంటి ఆడపిల్లల్ని గౌరవించాలి. అలా చేస్తే శుక్ర గ్రహము అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే, మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకపోతే కన్న తల్లిని గౌరవించాలి. కన్న తల్లికి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి, పాద నమస్కారం చేస్తే చాలా మంచిది. బుధుడి అనుగ్రహం కోసం మేనమామను ఆదరించాలి. యోగక్షేమాలు చూసుకోవాలి. లగ్న కుండలి ఆధారంగా చెయ్యకూడని పనులు చేస్తే వారికే నష్టం.
శని అనుగ్రహం కోసం ఎదుటివాళ్ళ మీద చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. పని వాళ్ళకి తగినంత జీతం కూడా ఇవ్వాలి. కుజుడు అనుగ్రహం కోసం సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరిని బాగా చూసుకోవాలి. అలానే మీరు మీ స్థితిని చూసుకునే దానికి తగ్గట్టుగా అనుసరించాలి. రవి స్థితిని అనుసరించి, కొంతమంది ఏ వస్తువు ఎవరి దగ్గర నుండి ఉచితంగా తీసుకోకూడదు. చంద్రుడి యొక్క స్థితిని చూసుకొని, పాలు, నీరు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. కుజుడిని చూసుకుని చక్కెర వ్యాపారం చేయకండి. వికలాంగులకి దూరంగా ఉండాలి.
బుధుడు స్థితిని చూసుకుని మాంసాహారం, గుడ్లు, చేపలు తినకూడదు. ఆకుపచ్చ దుస్తులు వేసుకోకూడదు. గురువు స్థానాన్ని చూసుకుని సాధువులకి, సన్యాసులకి సహాయం చేయకండి. వస్త్రాలని దానంగా ఇవ్వకండి. శుక్ర గ్రహం యొక్క స్థితిని చూసుకొని ఎక్కువ శబ్దంతో సంగీతం వినకండి. డాన్స్ చేయకూడదు. శని భగవానుడు స్థితి చూసుకొని గంగా భగీరధులకి దూరంగా ఉండాలి. రాహువు స్థితిని బట్టి బ్లూ కలర్ బట్టలు వేసుకోకూడదు. కేతువు స్థితి బట్టి వాగ్దానాలు చేయకూడదు. సంతానం లేని వారి దగ్గర భూమి కొనకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…