Lord Ganesha : సనాతన ధర్మంలో ఒక్కో దేవుడికి, దేవతకి ఒక ప్రత్యేకమైన రోజు నిర్ణయించబడింది. అందులో బుధవారాన్ని గణేశుడికి అంకింతం చేయబడింది. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల, జోతిష్య పరిహారాలు చేయడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. అలాగే మనం చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభ కార్యమైనా గణపతి పూజతోనే ప్రారంభం అవుతుంది. గణపతిని తెలివితేటల దేవుడు అని కూడా అంటారు. గణపతిని పూజించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే సమస్యలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు.
ఎవరైతే వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారో అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసిపోతారో అలాంటి వారు బుధవారం నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. అలాగే 7, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఉండే కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే చేసే పనిలో విజయాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు ఇంటర్వ్యూకి వెళ్లబోయే ముందు ఖచ్చితంగా గణపతిని పూజించాలి. గణపతిని పూజించడంతో పాటు నుదుటిపై సింధూరాన్ని ధరించాలి. ఆ తరువాతే ఇంటర్వ్యూకి బయలుదేరాలి. ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అలాగే బుధవారం నాడు ఆవుకు పచ్చి మేత తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
ఏదైనా పనికి వెళ్లే ముందు ఆవుకు పచ్చిగడ్డి తినిపించి వెళ్లాలి. అదేవిధంగా దగ్గర్లో ఉండే గోశాలకు పచ్చిగడ్డిని దానం చేయాలి . ఇలా చేయడం వల్ల చేసే పనిలో విజయం లభించడంతో పాటు పుణ్య ఫలాలు దక్కుతాయి. అలాగే జోతిష్య శాస్త్రం ప్రకారం గణపతికి ఎంతో ఇష్టమైన బుధవారం నాడు పచ్చి శనగలను, ఆకుపచ్చరంగు దుస్తులను దానం చేయడం వల్ల మనం తలపెట్టిన పనులన్నీ నెరవేరుతాయి. కష్టాల నుండి ఉపవమనం కలుగుతుంది. జీవితంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. అలాగే గణపతి యొకర్క ఆశీస్సులు ఎల్లపుడూ మీపై ఉండాలంటే బుధవారం నాడు గణపతికి 11 లేదా 21 గరికెలను సమర్పించాలి. గణపతికి గరికె అంటే చాలా ప్రీతి. గణపతికి గరికెను సమర్పించడం వల్ల మన కోర్కెలు నెరవేరుతాయని జోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా బుధవారం నాడు గణపతిని పూజిస్తూ తగిన పరిహారాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలిగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…