Lemon For Dishti : దృష్టి దోషాల వలన చాలా మంది సతమతమవుతుంటారు. దృష్టి దోషాలు కలిగి, అనేక బాధలు ఎదుర్కొంటున్నట్లయితే, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఈ చిట్కాలను తప్పక పాటించండి. నిమ్మకాయలని దృష్టి దోషాలని తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. పాజిటివ్ ఎనర్జీని కలిగించేసి, నెగటివ్ ఎనర్జీ తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. పైగా వీటిలో అతీత శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు.
ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు, మనం వ్యాపారస్తులు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయని పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే, ఇలా షాపుల్లో వాటిని పెట్టడం వలన కొన్ని ప్రత్యేకమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. దుష్ట శక్తుల నుండి నిమ్మకాయలు రక్షిస్తాయని యజమానుల నమ్మకం. అలానే, కొంతమంది షాపుల్లో నిమ్మకాయలని, మిరపకాయలని కట్టి వేలాడదీస్తూ ఉంటారు. మంత్ర తంత్రాలలో నిమ్మకాయలకి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది అని అంటారు.
అయితే, దృష్టి దోషాలు తొలగిపోవాలన్నా, సమస్యలు ఏమి లేకుండా డబ్బులు రావాలన్న, ప్రశాంతంగా జీవించాలన్న ఇలా ఆచరించండి. గురువారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి, నాలుగు నిమ్మకాయలని, లవంగాలని తీసుకువెళ్లి పూజ చేయండి. ఇక మీకు ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. వ్యాపారం సరిగ్గా జరగకపోతున్నట్లయితే, నిమ్మకాయలను తీసుకుని షాపులోని నాలుగు గోడలకి ఆ నిమ్మకాయలని ముట్టించి, ఆ తర్వాత నిమ్మకాయల్ని నాలుగు ముక్కల కింద చేసి నాలుగు దిక్కులలో ఆ ముక్కల్ని పెట్టండి. ఇలా చేయడం వలన శని అంతా బయటకు వెళ్ళిపోతుంది.
అలానే, ఇంటి ఆవరణలో ఒక నిమ్మకాయ చెట్టుని పెంచడం వలన దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. వాస్తు దోషాల నుండి కూడా బయటపడొచ్చు. దృష్టి దోషంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఒక నిమ్మకాయని తీసుకుని కింద నుండి పై వరకు దిష్టి తీసేసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో పడేయాలి. ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి చూడకుండా వచ్చేయాలి. దిష్టి మొత్తం పోతుంది. హాల్లో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి, అందులో ఒక నిమ్మకాయని పెడితే దృష్టి దోషాలు ఉండవు. ఇలా సులభంగా నిమ్మకాయaతో దృష్టి దోషాలు తొలగిపోతాయి. ధనం కలుగుతుంది. బాధల నుండి విముక్తి పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…