Lakshmi Devi : జోతిష్య శాస్త్రంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానం చేయడం వల్ల మన జాతకంలో గ్రహాల ప్రభావం తగ్గుతుంది. దీంతో సమస్యల నుండి మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనం అవసరమైన వారికి వారి అవసరాన్ని బట్టి మాత్రమే దానం చేయాలి. విరాశాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే మనకు ఎక్కువ పుణ్యఫలితాలు లభిస్తాయి. అలాగే దానం చేసేటప్పుడు నిస్వార్థంగా, ఆనందంగా దానం చేయాలి. దుఃఖంతో, ద్వేషంతో చేసే దానాలకు ఎటువంటి ఫలితం ఉండదు. ఏది ఏమైనప్పటికి జోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. వీటిని దానం చేయడం వల్ల మనం పుణ్యానికి బదులుగా పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది.
అలాగే భగవంతుడి కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం మనం దానం చేయకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవనూనెను దానం చేయడం మంచిది. చాలా మంది ఆవనూనెను దానం చేస్తూ ఉంటారు. అయితే కొందరు వాడిన ఆవనూనెను కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంంచిది కాదు. పుణ్యానికి బదులు పాపం వస్తుంది. మనం శని దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే పసుపును సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడదు. పసుపును బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. కనుక గురువారం నాడు పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి బలహీనపడుతుంది. దీని వల్ల మనం జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా జోతిష్యశాస్త్రం ప్రకారం ఉప్పును కూడా దానం చేయవద్దు. ఉప్పును దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అలాగే పాత్రలను కూడా ఎప్పుడూ దానం చేయవద్దు. ఏ లోహంతో తయారు చేసిన పాత్రలను కూడా దానం చేయవద్దు. పాత్రలను దానం చేయడం వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. కుటుంబం యొక్క ఆనందం, శాంతి అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే పుణ్యం వస్తుందని చాలా మంది మత గ్రంథాలను దానంగా ఇస్తూ ఉంటారు. మత గ్రంథాలను దానం చేసేటప్పుడు పాత వాటిని, చిరిగిన వాటిని దానం చేయకూడదని గుర్తుంచుకోవాలి. చిరిగిన మత గ్రంథాలను దానం చేయడం వల్ల ఇంట్లోకి దురదృష్టం వస్తుందని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…