Jasmine Flowers : ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా.. మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుంటుంది అన్నది సత్యం. ఇక అలాంటిదే ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే.. భర్త తన భార్యకు రోజూ మల్లెపూలను తీసుకెళ్లడం. అవును.. అదే.. ఇంతకీ ప్రతి రోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత ఒద్దిగ్గా, అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్దికసమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజూ మూరెడు మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిదట.
మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేక పోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతి రోజూ ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక పురుషులు ఈ చిన్న చిట్కాను పాటిస్తే శుక్రుని అనుగ్రహం పొంది తద్వారా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణించవచ్చు. దాంతో డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు పోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…