Cow In Dream : మనం నిద్రించినప్పుడు కలలు రావడం చాలా సహజం. మన రోజు వారి జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా కొన్ని కలలు వస్తే మనకే తెలియని ఊహజనితా లోకంలో విహరిస్తున్నట్టు ఉండే కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని కలలు మనకు భయాన్నికలిగించేవిగా, మన నిద్రను పాడు చేసేవిగా ఉంటే కొన్ని మాత్రం మనకు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. కలలో కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనకు కొన్ని సూచనలను ఇస్తుంది. కలలో గనుక ఆవు కనిపించినట్లయితే మన జీవితంలో మార్పు వస్తుంది. హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవుకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రంగా భావించే ఆవు కలలో కనిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో ఆవు కనిపిస్తే చాలా శుభదాయకం. కలలో ఆవు కనిపించినట్లయితే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. అలాగే కలలో ఆవుకు రొట్టె తినిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఆవుకు రొట్టె తినిపించనట్టు కలలో వస్తే అది కూడా శుభదాయకం. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఇలాంటి కల రావడం వల్ల త్వరలో మీరు ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారని అర్థం. ఆవుకు రొట్టె తినిపించినట్టు కల వస్తే వ్యాధి తగ్గి ఆరోగ్యంగా తయారవుతారు. అలాగే కలలో ఆవుగుంపును, ఆవుల మందను చూడడం కూడా శుభప్రదం. ఇలాంటి కల వస్తే మీరు ఆర్థికంగా చాలా లాభపడతారు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీకు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.
వ్యాపారం వృద్ది చెందుతుంది. అదేవిధంగా కలలో ఆవు దూడను కనిపించినట్టయితే మీరు ఆర్థికంగా లాభం పొందుతారు. ఇది కూడా చక్కటి శుభసూచకం. ఆవు దూడ కనిపించడం వల్ల ఊహించని ఆర్థిక లాభం చేకూరుతుంది. మీకు చేరాల్సిన డబ్బు కూడా చేరుతుంది. అలాగేమీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ పనుల్లో కూడా మంచి ఫలితాలను, చక్కటి ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఆవు దూడ కనిపించడం వల్ల మీ పిల్లల నుండి చక్కటి శుభవార్తను వింటారు. కలలో ఆవు కనిపిస్తే మనకు ఎంతో మేలు కలుగుతుందని, ఆవు కనిపించడం ఎంతో శుభదాయకమని డ్రీమ్ సైన్స్ చెబుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…