పురాతన కాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాల్లో శకున శాస్త్రం కూడా ఒకటి. కొందరు మనుషులు లేదా కొన్ని రకాల జంతువులను మనం బయటకు వెళ్తున్నప్పుడు చూసినా.. ఎదురు వచ్చినా.. వాటిని బట్టి భిన్న రకాల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే చాలా మంది పిల్లి.. అది నల్లదైనా.. ఏదైనా సరే.. ఎదురు వేస్తే అశుభంగా భావిస్తారు. ఇలా శకున శాస్త్రంలో చెప్పబడింది. అయితే కుక్కలకు కూడా శకున శాస్త్రం వర్తిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కుక్క ప్రవర్తన, అది తెచ్చే వస్తువులు, అది ఎదురయ్యే విధానం బట్టి శకునం మారుతుందని.. శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. అయితే కుక్క ఎలా ఎదురు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కను కాలభైరవుడికి ప్రతిరూపంగా భావిస్తారు. కనుక కుక్కలను కొట్టరాదు. వాటికి ఆహారం పెట్టాలి. ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టి నీళ్లు ఇస్తే చాలా మంచిది. దీంతో కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. దుష్టశక్తులు ఏమీ చేయలేవు. గాలి, ధూళి ఉంటే పోతాయి. దిష్టి తొలగిపోతుంది. చిన్నారులు చదువుల్లో వెనుకబడిపోతున్నా, మంద బుద్ధులుగా ఉంటున్నా.. కుక్కలచే స్నేహం చేయించాలి. దీంతో కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. వారు తెలివిమంతులుగా మారుతారు.
ఇక బయటకు వెళ్లేటప్పుడు కుక్క బురద వెదజల్లుతూ కనిపించినా, టైర్ల మీద మూత్ర విసర్జన చేస్తూ కనిపించినా అశుభం జరుగుతుందట. ఆ ఇంటి యజమానికి ఏదో ఆపద వస్తుందని అర్థం. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కుక్క నోట్లో ఎముక లేదా ఏదైనా జీవి, మాంసం వంటి ముక్కలతో కనిపించినా ఏదో ఆపద జరగబోతుందని సంకేతమట. అలాంటి సమయంలో అసలు బయటకు వెళ్లకూడదు. కుక్క ఏదైనా పొలంలో కాళ్లతో తోడుతుంటే ఆ పొలంలో పంట బాగా పండుతుందని అర్థమట. ఇక రెండు కుక్కలు సంభోగంలో కనిపిస్తే వాటి వైపు అసలు చూడకూడదట. ఎంతో అరిష్టం కలుగుతుందట. అలాగే కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంటే ఆ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక అరిష్టం జరగబోతుందనడానికి సంకేతమట.
బయటకు వెళ్లే సమయంలో కుక్క ఎదురుగా వచ్చి ఒళ్లు విరిచినా, కాళ్లను నాకినా.. ఆ పని మానుకోవాలట. ప్రయాణంలో ఏవైనా ఆపదలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయట. అలాగే ఒకవేళ ఏదైనా పని మీద బయటకు వెళ్తే అది జరగదట. ఇక బయటకు వెళ్లే సమయంలో కుక్క నోట్లో ఏదైనా వస్త్రం ఉంటే మాత్రం అది మిక్కిలి శుభ శకునమట. దీంతో అంతా మంచే జరుగుతుందట. అనుకున్నది నెరవేరుతుందట. అయితే అశుభ శకునం కనిపిస్తే మళ్లీ ఇంటి లోపలికి వచ్చి కాళ్లను కడుక్కుని కాలభైరవున్ని స్మరించి బయటకు వెళ్లవచ్చు. దీంతో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉంటాయని చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…