Horoscope : ఈ సంవత్సరం ఏప్రిల్ 23 న కుజుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి నాడు ఈ సంచారం జరగడం వల్ల ఈ కుజ సంచారం చాలా ప్రత్యేకం అయ్యింది. అంతేకాకుండా ఈ రోజున యాదృచ్చిక సంఘటనలు జరిగాయి. భూమి నిర్మాణం, అంగారక సంచారంతో పాటు హనుమాన్ జయంతి కావున ఈ కుజ సంచారం చాలా శుభప్రదం. ఈ సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపించినప్పటికి ఈ 5 రాశుల వారికి ఈ సంచారం మరింత శుభప్రదం కానుంది. కుజుడు ఏప్రిల్ 23 నుండి జూన్ 1 2024 వరకు మీనరాశిలోనే ఉండనున్నాడు. కుజుడు దాదాపు 37 రోజుల పాటు మీనరాశిలో ఉండి ఈ 5 రాశుల వారికి మరింత మేలు చేయనున్నాడు. కుజుడి సంచారం వల్ల మేలు కలగనున్న 5 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుజుడి సంచారం మేలు చేయనున్న 5 రాశులల్లో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారికి కుజుడి సంచారం చాలా శుభప్రదం కానుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వీరు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు ఈ కాలం ఎంతో కలిసి రానుంది. కుజుడు సంచారం వల్ల మేలు కలిగే రాశులల్లో మిథున రాశి ఒకటి. వీరి ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో విజయాలు సాధిస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల నుండి ఆనందం కలుగుతుంది. వ్యాపారులకు మేలు కలుగుతుంది. ఈ రాశి వారు తండ్రి నుండి శుభవార్త వింటారు. అలాగే కన్య రాశి వారికి కూడా కుజుడు సంచారం మేలు చేయనుంది. కుజుడి సంచారం కన్యారాశి వారికి భాగస్వామి పరంగా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు కష్టపడి పని చేసి మంచి ఫలితాలను పొందుతారు.
అలాగే కుజుడి సంచారం వృశ్చిక రాశి వారికి కూడా మేలు చేయనుంది. కుజుడు ఈ రాశి వారికి విశేషమైన వరాలు కురిపిస్తాడు. ఈ రాశి వారు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. జ్ఞానాన్ని పొందడానికి, కెరీర్ ను సరైన మార్గంలో నడిపించడానికి ఈ సమయం చాలా మంచిది. మీరు చేసే పనులల్లో మీ జ్ఞానం మరియు విచక్షణ కారణంగానే విజయం లభిస్తుంది. అలాగే కుంభ రాశి వారికి కూడా కుజుడి సంచారం మేలు చేయనుంది. ఈ రాశి వారు వారి అత్తమామల నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఈ విధంగా కుజుడి సంచారం ఈ రాశుల వారికి మరింత మేలు చేయనున్నదని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…