Shankhuvu : హిందూ మతంలో కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా భావిస్తారు. వాటికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా పవిత్రంగా భావించే వస్తువులల్లో శంఖం కూడా ఒకటి. హిందూ మత గ్రంథాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. అనంతరం శంఖాన్ని స్వీకరించారు. ఈ కారణం చేత శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. చాలా మంది ఇంట్లో శంఖాన్ని ఉంచుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు. శంఖం నుండి వచ్చే ధ్వనితో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చాలా మంది విశ్వసిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం మంచిదే అయినప్పటికి ఎలా పడితే అలా శంఖాన్ని ఉంచకూడదు.
ఇంట్లో శంఖం ఉంటే కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాలను పాటించకుంటే మంచి జరగడానికి బదులుగా చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకునే వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కూడా శంఖాన్ని నేలపై ఉంచకూడదు. శంఖాన్ని నేలపై ఉంచడం అంటే శంఖాన్ని అవమానించినట్టే. శంఖాన్ని ఎల్లప్పుడూ పీటపై ఉంచాలి. కటిక నేలపై ఉంచకూడదు. అలాగే శంఖాన్ని ఉపయోగించిన తరువాత శుభ్రం ఉంచాలి. శంఖంపై నీటి చుక్క కూడా లేకుండా చూసుకోవాలి. నీటి చుక్కల కారణంగా శంఖానికి నష్టం కలగవచ్చు. అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలోనే ఉంచాలి. లక్ష్మీ, విష్ణువు దగ్గర శంఖాన్ని ఉంచడం మంచిది.
అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ గుడ్డతో కప్పి ఉంచాలి. అదేవిధంగా ఇంటికి శంఖాన్ని ఎప్పుడు పడితే తీసుకురాకూడదు. శివరాత్రి, నవరాత్రి సమయంలోనే ఇంటికి శంఖాన్ని తీసుకురావాలి. ఈ రోజుల్లో శంఖాన్ని ఊదడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే శంఖాన్ని ఊదిన తరువాత శుభ్రం చేయడం చాలా అవసరం. శంఖం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. శంఖాన్ని ఊదిన తరువాత గంగాజలంతో లేదా నీటితో శుభ్రం చేసి తడి లేకుండా గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయేడం వల్ల శంఖం స్వచ్చంగా ఉంటుంది. అలాగే శంఖాన్ని ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. శంఖం యొక్క ఓపెన్ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరిగి నెగిటివిటీ తగ్గుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…