Eka Mukhi Rudraksha : రుద్రాక్షల గురించి అందరికీ తెలిసిందే. వీటిలో అనేక రకాలు ఉంటాయి. రుద్రాక్షలను చాలా మంది మెడలో ధరిస్తారు. కొందరు చేతులకు ధరిస్తారు. కొందరు వీటిని మాలతో జపం చేస్తారు. రుద్రాక్షలతో అనేక లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే అన్నింటిలోకి ఏకముఖ రుద్రాక్ష ఎంతో విశిష్టమైందని చెబుతారు. దీన్నే శివ రుద్రాక్ష అంటారు. దీన్ని సాక్షాత్తూ శివుడి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. అందువల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ లభించదు. ఇక దీన్ని రత్నంతో ధరించాల్సి ఉంటుంది. దీన్ని సూర్యుడి స్వరూపంగా కూడా భావించి పూజలు చేస్తారు. అందువల్ల ఈ రుద్రాక్షను ధరిస్తే నియమ నిష్టలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే సూర్యుని అనుగ్రహం కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఆయన సకల జీవకోటికి శక్తి, వెలుగు ప్రదాత. కనుక సూర్యుని అనుగ్రహం ఉంటే ఏ పని అయినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. అంతులేని సిరి సంపదలు, ఆరోగ్యం కలుగుతాయి. కాబట్టి ఏకముఖి రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది.
ఇక ఈ రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అందువల్ల దీన్ని గుర్తు పట్టడం కూడా సులభమే. దీన్ని ధరిస్తే గాలి ధూళి దరిచేరవు. ఎవరూ మంత్ర తంత్ర ప్రయోగాలు చేయలేరు. భక్తి భావం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. మనస్సు స్థిరంగా ఉంటుంది. చెడు బుద్ధులు పోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రుద్రాక్ష ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ దీన్ని ధరిస్తే అనేక లాభాలు పొందవచ్చు. దీన్ని పండితుల సూచన మేరకు ధరించాలి. ఆ సమయంలో 11 సార్లు రుద్రాక్ష మంత్రంతో జపం చేయాలి. ఈ రుద్రాక్షను ధరిస్తే బ్రహ్మ హత్యాదోషం తొలగిపోతుంది. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మొండి వ్యాధులు తగ్గిపోతుంది. కనుక ఏకముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా లాభాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…