Money : మనుషులెవరైనా కష్టపడేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బతకడానికే కదా. వారు, వారితోపాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు. ధనవంతులుగా ఉంటారు. కానీ పేదరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా. అయితే మనం చేసే పలు రకాల పనుల వల్ల ధనవంతులం కాస్తా పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు, సమస్యలు మనల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట. మరి ఏయే పనుల వల్ల మనకు దరిద్రం కలుగుతుందో, వేటిని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాకకూడదు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట. అంతే కాకుండా ప్రతికూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి. అన్నీ సమస్యలను తెచ్చి పెడతాయి. నేలమీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తాకకూడదు. అలాగే మనం ఆహారం తినే ప్లేట్‌లో ఎట్టి పరిస్థితిలోనూ పొరపాటున కూడా అడుగుపెట్టకూడదు. అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది. సంపద అస్సలు కలసి రాదు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు. అలా చేస్తే అపశకునం కలుగుతుంది. దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది.
ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. అలా పడితే అంతా దురదృష్టమే కలుగుతుందట. ఏది చేసినా కలసి రాదట. సంపద అస్సలు దరి చేరదట. దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దరిద్ర దేవత వెంటాడుతుంది. సంపద అస్సలు చేకూరదు. శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తరువాత గంగా జలం (నీరు)తో కచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే పేదరికం కలుగుతుంది. ఉన్న సంపద అంతా తుడిచిపెట్టుకుపోతుందట.
దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు. అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచరాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట. దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట. దరిద్రులు అవుతారట. సంపద మొత్తం పోతుందట. ఈ 8 సూచనలను నారద పురాణంలో ఇచ్చారు. కనుకనే వీటి గురించి చెప్పాం. కాబట్టి ఈ పనులను చేయకండి. లేదంటే ఆపదలను కొని తెచ్చుకున్న వారవుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…