Bath : మనం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయడం వల్ల మనకు ఏదో తెలియని భారం దిగినట్టుగా ఉంటుంది. స్నానం చేయడం వల్ల మన శరీరంతో పాటు మన ఆత్మ కూడా శుద్ది అవుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అయితే స్నానం చేసిన తరువాత మనం చేసే పనులే మనకు దరిద్రాన్ని తీసుకువస్తాయి. మనం తెలిసి తెలియక చేసే తప్పులే మనకు కష్టాలను తీసుకు వస్తాయి. చాలా మందికి ఇవి తప్పులు, ఇవి చేయకూడదు అని కూడా తెలియదు. వారు తెలియక చేసే ఈ పనుల వల్లె కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు స్నానం చేసిన తరువాత పాటించవలసిన నియమాలు ఏమిటి…వీటి గురించి మన పెద్దలు ఏం చెప్పారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది స్నానం చేసిన తరువాత బకెట్లో నీటిని వదిలి వస్తూ ఉంటారు. కానీ అలా వదిలి పెట్టకూడదు. స్నానం చేసిన తరువాత మిగిలిన నీటిని ఇతరులు వాడితే అది ఆ వ్యక్తి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం ఎప్పుడూ శుభ్రమైన బకెట్ లో నీటిని నింపుకుని స్నానం చేయాలి. బకెట్ లో నీళ్లు లేనప్పుడు బకెట్ ను బోర్లించి ఉంచాలి. దీని వల్ల ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. అలాగే వివాహం అయిన స్త్రీలు తలస్నానం చేసిన తరువాత జుట్టును పూర్తిగా ఆరబెట్టుకున్న తరువాతే కుంకుమ పెట్టుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు. అలాగే తలస్నానం చేసిన తరువాత జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి తలస్నానం చేసిన తరువాత జుట్టును వదిలి వేయకుండా కనీసం జుట్టు చివరనైనా చిన్నగా ముడి వేసుకోవాలి. స్నానానికి ముందు గోర్లను కత్తిరించకూడదు. అలాగే స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను వాడకూడదు.
స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకు వెళ్లకూడదు. మంట దగ్గరకు వెళ్లకూడదు. స్నానం చేసిన తరువాత ఏదైనా తిని ఆ తరువాత వంటగదిలోకి వెళ్లాలి. అలాగే స్నానం చేసిన వెంటనే స్త్రీలు మేకప్ వేసుకోకూడదు. అలాగే తడి బట్టలను వెంటనే ఉతికిఆరబెట్టాలి. స్నానం చేసిన తరువాత బాత్ రూమ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బాత్ రూమ్ అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఉంటుంది. రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. దీని వల్ల ఈ గ్రహాల దుష్పలితాలు మనపై ఎక్కువగా ఉండడంతో పాటు వేగంగా ఉంటాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా నడుచుకోవడం చాలా అవసరమని పెద్దలు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…