Birth Marks : మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది.
తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి. ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలో, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టు మచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ, కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుంది. తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది.
మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య.. వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ వుంటుంది. ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గనక.. మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని.. సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు. మాడు భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరికి సంపాదనే కాదు.. సంతానమూ ఎక్కువే. ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి.
దురుసుతనానికి.. నిదర్శనంగా వీరు కనిపిస్తారు. సహజంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి. ఈ నొసలు సువిశాలంగా ఉన్న వ్యక్తిని మంచి ఆలోచనాపరుడిగా గుర్తించవచ్చు. అటువంటి నుదుటి భాగాన మచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచి వాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు. ఇక కుడి కనుబొమ మీద మచ్చ ఉంటే వివాహం తొందరగానే అవుతుంది. సుగుణశీలిగల భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు. కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే.. వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు.
మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్పవచ్చు. వ్యక్తి స్వభావాలు, జాతకం చెప్పాలంటే శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యమే. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచికములని పెద్దలు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి. అలాగే పుట్టు మచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే గనక ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…