Pregnant : చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది వాస్తు ప్రకారమే అనుసరిస్తున్నారు. వాస్తు దోషాల వల్ల మన జీవితంలో సమస్యలు వస్తాయి. చిన్న చిన్న వాస్తు దోషాల వలన కూడా ఇంట్లో అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాస్తు దోషాల వల్ల ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. వాస్తు దోషాల వలన ఇంట్లో సంతానాన్ని కూడా ఎవరూ పొందలేరు. సంతాన సమస్యలు కలగకుండా ఉండాలంటే, కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించండి.
సువాసన గల పువ్వులని పడకగదిలో పెట్టుకుంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని గుర్తు చేసే వస్తువులని కనపడే చోట పెడితే, భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. ఎప్పుడూ కూడా తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి. వివాహమైన జంట బెడ్రూంలో ఆగ్నేయ భాగంలో నిద్రపోతే మంచిది. శృంగార జీవితం బాగుంటుంది.
నిద్రపోయేటప్పుడు తల పడమర వైపు, పాదాలు తూర్పు వైపు పెట్టుకుని నిద్రపోతే కూడా మంచే జరుగుతుంది. అందమైన చిత్రాలు, పెయింటింగ్ లు, చిన్నపిల్లల ఫోటోలని బెడ్రూంలో పెట్టుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. బెడ్ రూమ్ లో ఉన్న నాణ్యమైన సమయాన్ని భార్యాభర్తలు గడపాలి. మీ ఇద్దరికి సంబంధించిన విషయాలను మాత్రమే పడకగదిలో మాట్లాడుకోవాలి, బెడ్రూంలో గుండ్రంగా ఉండే మంచాన్ని ఉపయోగించకపోవడం మంచిది.
బెడ్రూంలో భయంకరమైన చిత్రాలు, డ్రాగన్, యుద్ధానికి సంబంధించినవి, హింసకి సంబంధించినవి పెట్టుకోకూడదు. గర్భిణీలు అయితే లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిది. పడక గదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అనవసరమైన వస్తువులని పడక గది నుండి తొలగించడం మంచిది. ప్రశాంతంగా, సానుకూల భావన కలిగించే విధంగా బెడ్ రూమ్ ని అలంకరించుకోవాలి. ఇలా ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే భార్యాభర్తలు ప్రేమానురాగాలతో కలకాలం కలిసి సంతోషంగా వుంటారు.