Balcony Plants : ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్‌లా మారింది. చూద్దామంటే మచ్చుకు ఒక చెట్టు కూడా కనిపించడం లేదు. దీంతో రోజంతా పనిచేసే వాళ్లకు పచ్చని ప్రకృతిలో సేదదీరుదామంటే అది అందని ద్రాక్షే అయింది. దీంతో ఇంట్లో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చాలా మంది మొక్కలు పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్నది అపార్ట్‌మెంట్ కల్చర్ కనుక ప్రజలు తమ బాల్కనీలో వివిధ రకాల మొక్కలను పెట్టుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే బాల్కనీ ఏ దిక్కున ఉంటే ఏయే మొక్కలను ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ బాల్కనీ తూర్పు దిశలో ఉంటే తులసి, బంతి పువ్వుల మొక్కలను పెట్టాలి. ఇలా చేస్తే మీతోపాటు మీ పిల్లల కెరీర్‌పై అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మొక్కలను బాల్కనీలో ఈశాన్య దిశలో పెట్టాలి. ఇక మీ ఇంటి బాల్కనీ ఉత్తర దిశలో ఉంటే అక్కడ మనీ ప్లాంట్ లేదా క్రాసులా ప్లాంట్‌ను పెంచితే మంచిది. అదే బాల్కనీ పశ్చిమ దిశలో ఉంటే అక్కడ 2-4 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను పెంచాలి. పెద్ద మొక్కలను పెంచితే శనీశ్వరుడి ప్రభావం పడుతుంది.
మీ ఇంటి బాల్కనీ దక్షిణ దిశలో ఉంటే అక్కడ పెద్దవైన, భారీ మొక్కలను ఉంచితే మంచి జరుగుతుంది. బౌగెన్‌విల్లా, బ్లాక్ ఫికస్, పామ్ ట్రీ వంటి కొన్ని మొక్కలను పెట్టవచ్చు. ఇవి మీ బాల్కనీని అందంగా మారుస్తాయి. వాస్తు దోషాలు కలగకుండా చేస్తాయి. ఇక కొన్ని రకాల మొక్కలను అసలు బాల్కనీలో పెట్టకూడదు. కాక్టస్ లేదా రబ్బర్ మొక్కలను బాల్కనీలో పెట్టకూడదు. బాల్కనీలో ఉంచిన మొక్కలు ఎండిపోతే వెంటనే తొలగించి వేరే మొక్కలను పెట్టాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…