April Born People : జోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వారి లక్షణాలను వారి యొక్క రాశిఫలం, రాడిక్స్ సంఖ్య ఆధారంగా చెబుతూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వారు జన్మించిన నెల ఆధారంగా కూడా చెప్పవచ్చు. ఏప్రిల్ నెల రానే వచ్చింది. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో జన్మించిన వారి లక్షణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు చాలా మక్కువ కలిగి ఉంటారు. వారు చేయాలనుకున్న పనులు చేసిన తరువాతే వారు మరణించడం జరుగుతుంది. అలాగే వారు చాలా ధైర్యవంతులు. పరిస్థితులు ఏ విధంగా వచ్చినప్పటికి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పటికి వారు ధృడంగా ఉంటారు. దేనికి భయపడరు.
వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వారి యొక్క అభిరుచి సానుకూలత మరియు ప్రతికూల అంశాలపై ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు ఎక్కువగా క్రీడలు, మీడియా, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. అలాగే వీరికి సమాజంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీరితో కలిసి జీవించాలని కోరుకుంటారు. అలాగే ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ప్రేమను మరియు గౌరవాన్ని పొందడంలో అదృష్టవంతులు అని చెప్పవచ్చు. స్నేహితులు, బంధువులు వీరికి అమితమైన గౌరవాన్ని, ప్రేమను ఇస్తారు. భాగస్వామిని సంతోషంగా ఉంచాలనుకునే గుణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ఇతరుల మనస్సు దెబ్బతినకుండా నడుచుకుంటారు.
చెడుచేయాలనుకునే వారికి కూడా మంచి చేసే గుణం కలిగి ఉంటారు. వీరు భావోద్వేగాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి ఉన్న లక్షణాల్లో ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఒకటి. ఎప్పుడూ కూడా ఇతరుల జీవితాల గురించి ఎక్కువగా ఆలోచించి జోక్యం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వీరు నియంతల వలె ప్రవర్తిస్తారు. ఇది వారి సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈవిధంగా ఏప్రిల్ నెలలో జన్మించిన వారు సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారని అందరి నుండి ప్రేమను, గౌరవాన్ని పొందడంలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…