ఆధార్ కార్డులో సహజంగానే అప్పుడప్పుడు మనం పలు మార్పులు చేస్తుంటాం. అడ్రస్, ఫొటో, ఫోన్ నంబర్ ఇలా పలు మార్పులు చేస్తుంటాం. కొన్ని మార్పులకు గాను ఆధార్ కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాలి. కానీ కొన్ని మార్పులను ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో లేదా కేంద్రం వద్ద చేసే కొన్ని రకాల ఆధార్ మార్పులకు గాను వివిధ రకాల పత్రాలు అవసరం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిలేషన్ షిప్ ప్రూఫ్ కోసం.. ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, పెన్షన్ కార్డు, పాస్‌పోర్టు, ఆర్మీ క్యాంటీన్ కార్డులలో ఏదైనా ఒక దాన్ని ప్రూఫ్ కింద చూపించవచ్చు. పుట్టిన తేదీ ధ్రువపత్రం కోసం బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు, పాన్ కార్డు, మార్క్ షీట్స్, ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్‌లలో ఏదైనా ఒక దాన్ని చూపించవచ్చు.
ఇక ఐడీ ప్రూఫ్ కోసం అయితే.. పాస్ పోర్టు, పాన్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో దేన్నయినా ఒక దాన్ని చూపించవచ్చు.
అలాగే చిరునామా ధ్రువీకరణ కోసం అయితే పాస్ పోర్టు, బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్ బుక్, రేషన్ కార్డు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్లులలో దేన్నయినా ఒక దాన్ని చూపించవచ్చు.
ఇలా ఆధార్‌లో చేసే ఆయా మార్పులకు అనుగుణంగా ఆయా పత్రాలను చూపించవచ్చు. ఈ వివరాలను యూఐడీఏఐ తాజాగా తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…