స‌మాచారం

Train Seats : రైళ్ల‌లో మ‌నం మ‌న‌కు కావ‌ల్సిన సీటును బుక్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.. ఎందుకో తెలుసా..?

Train Seats : బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు. చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగుండును అని అనుకుంటాం. ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు. నిద్ర ప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక సైన్స్ ఉందని తెలుసా.. బస్ అంటే మనకు కావాలసిన సీట్ బుక్ చేసుకుంటాం. సినిమా హాల్‌లో అయినా మనకు నచ్చిన సీట్ తీసుకుంటాం. కానీ ట్రెయిన్‌లో అలా కుదరదు. వాళ్లు ఏ సీట్ కేటాయిస్తే అదే తీసుకోవాలసి ఉంటుంది. అసలు ట్రెయిన్ లో సీట్ ల‌ను ఎలా కేటాయిస్తారో తెలుసా. దానికోసం వారు ఎలాంటి క్రమపద్ధ‌తిని అనుసరిస్తారో తెలుసా. క్రమ పద్ధ‌తి పాటించకపోతే ట్రెయిన్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుందని మీకు తెలుసా. అవన్నీ విషయాల‌ను తెలుసుకోండి.

ప్రయాణికుల బరువును అన్ని కోచ్‌ల్లో, అన్నివైపులా సమానంగా పంచేలా ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్‌ టికెట్‌లను బుక్‌చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు (ఎస్‌ 1- ఎస్‌10) ఉన్నాయనుకుందాం. ఒక్కో కోచ్‌లో 72 సీట్లతో మొత్తం 720 సీట్లు ఉంటాయి. మొదటగా బుక్‌చేసుకునే వ్యక్తికి మధ్యభాగంలో అంటే ఎస్‌-5 బోగీలో సాఫ్ట్‌వేర్‌ సీటును కేటాయిస్తుంది. కోచ్‌లోనూ మిడిల్‌ సీటు నుంచి టిక్కెట్లను బుక్ చేస్తుంది. అంటే 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరగా బుక్‌చేసుకునే వ్యక్తికి ఎస్‌1 లేదా ఎస్‌ 10 బోగీలో సీటును బుక్‌చేస్తుంది.

Train Seats

బెర్త్‌ విషయంలోనూ మొదటగా లోయర్‌ బెర్త్‌, ఆ తర్వాత మిడిల్‌ బెర్త్‌, చివరకు అప్పర్‌బెర్త్‌ను కేటాయిస్తుంది. అలా కాకుండా ఒక క్రమపద్ధతి లేకుండా టికెట్‌లను కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది. ఇలాంటి సమయాల్లో ములుపుల దగ్గర ట్రైన్‌ పడిపోయే ప్రమాదముంటుంది. కొన్ని బోగీలపై ఎక్కువ అపకేంద్రబలముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఫలితంగా రైలు పట్టాలు తప్పుతుంది. అందుకే రైలు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు భద్రతా చర్యల్లో భాగంగానే సీట్ల కేటాయింపును ఇలా ఒక క్రమపద్ధ‌తిలో చేస్తారు. అందువ‌ల్లే మ‌న‌కు రైళ్ల‌లో మ‌న‌కు కావ‌ల్సిన సీటును బుక్ చేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. సాఫ్ట్‌వేర్ ఆటోమేటిగ్గా మ‌న‌కు ఆ ప‌ని చేసి పెడుతుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM