స‌మాచారం

ఎస్బీఐ కస్టమర్లు: డెబిట్ కార్డు పోయిందా ? దెబ్బ‌తిందా ? ఎలా బ్లాక్ చేయాలి ? కొత్త కార్డు ఎలా పొందాలి ? తెలుసుకోండి..!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారులా ? మీ డెబిట్ కార్డు పోయిందా ? లేక దెబ్బ తిందా ? కార్డు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా ? అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కొత్త కార్డును సుల‌భంగానే పొంద‌వ‌చ్చు. అందుకు ఎస్‌బీఐ ప‌లు స‌దుపాయాల‌ను అందిస్తోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ వినియోగ‌దారులు ఆ బ్యాంక్ అందిస్తున్న ఐవీఆర్ కాల్ సదుపాయాన్ని ఉపయోగించి తిరిగి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఎస్‌బీఐ డెబిట్ కార్డును కోల్పోతే లేదా కార్డు దెబ్బతిన్నట్లయితే కొత్త కార్డును పొందడానికి వారు బ్యాంక్ శాఖకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. వారు త‌మ‌ రిజిస్టర్ చేయబడిన ఫోన్ నంబర్ నుండి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసి అక్క‌డ చెప్పే ప్రాంప్ట్ చేసిన సూచనలను అనుసరించాలి. దీంతో కార్డును సుల‌భంగా బ్లాక్ చేయ‌డంతోపాటు కొత్త కార్డును పొంద‌వ‌చ్చు. అందుకుగాను ఎస్‌బీఐ రెండు టోల్ ఫ్రీ నంబర్ల‌ను అందుబాటులో ఉంచింది. అవి – 1800 112 211 లేదా 1800 425 3800. ఇందులో దేనికి అయినా స‌రే ఎస్‌బీఐ వినియోగదారులు కాల్ చేసి స‌హాయం పొంద‌వ‌చ్చు.

ఐవీఆర్ ద్వారా ఎస్‌బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయడం ఎలా..

స్టెప్‌ 1: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800 112 211 లేదా 1800 425 3800 కు డయల్ చేయండి.

స్టెప్‌ 2: ప్రాంప్ట్ చేసినప్పుడు కార్డ్ బ్లాకింగ్ కోసం 0 బ‌ట‌న్‌ను నొక్కండి.

స్టెప్‌: 3: మీ ఎస్బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయ‌డానికి ఐవీఆర్ కాల్ మీకు రెండు మార్గాలు ఇస్తుంది. మొదటి ఎంపిక కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డెబిట్ కార్డ్ నంబర్ ఉపయోగించి కార్డ్ బ్లాకింగ్ కోసం 1 నొక్కాలి. రెండవ ఎంపిక కోసం, మీరు 2 నొక్కాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించాలి. అనంత‌రం కార్డును బ్లాక్ చేసే ప్రక్రియ కోసం మీ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.

స్టెప్‌ 4: ఆప్ష‌న్‌లో 1 ని ఎంచుకుంటే, మీరు మీ డెబిట్ కార్డు చివరి 5 అంకెలను నమోదు చేయాలి. నిర్ధారణ కోసం కాల్ చివరిలో 1 నొక్కాలి. 2 ను ఎంచుకుంటే మీరు ధృవీకరణ కోసం ఖాతా సంఖ్యకు చెందిన‌ చివరి 5 అంకెలను నమోదు చేయాలి.

స్టెప్‌ 5: మీ కార్డ్ విజయవంతంగా బ్లాక్ చేయబడుతుంది. మీరు దానిని ధృవీకరించే SMS ను పొందుతారు.

ఒకవేళ మీరు కొత్త కార్డు ఇష్యూ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, తదుపరి ప్రాసెసింగ్ కోసం మీరు 1 నొక్కాలి.

స్టెప్‌ 1: కొత్త కార్డు జారీ చేయాలనే అభ్యర్థనతో మరింత ముందుకు వెళ్ళడానికి, మీరు మీ పుట్టిన సంవత్సరాన్ని నమోదు చేయాలి.

స్టెప్‌ 2: నిర్ధారించడానికి 1 లేదా అభ్యర్థనను రద్దు చేయడానికి 2 నొక్కాలి.

స్టెప్‌ 3: మీరు అభ్యర్థనను ధృవీకరిస్తే, మీరు దాని కోసం నిర్ధారణ SMS ను పొందుతారు.

కొత్త డెబిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేశాక కార్డును మంజూరు చేసేందుకు మీ బ్యాంక్ ఖాతా నుండి కార్డ్ కు చెందిన ఫీజు వసూలు చేయబడుతుంది. బ్యాంకులో న‌మోదు అయి ఉన్న‌ మీ రిజిస్టర్డ్ చిరునామాకు కొత్త డెబిట్ కార్డు పంపబడుతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM