Loan To Farmers : ఈ రోజుల్లో రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో కష్టపడి పంట పండించిన కూడా చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. అయితే రైతులు పంట సాగు చేయాలంటే ముందుగా పెట్టుబడికి సరిపడా డబ్బులు ఉండాలి. ఇందుకోసం చాలా మంది రుణాలు తీసుకుంటారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం, పురుగు మందులు, ఇతర పనులు ఇలా దేనికైనా పెట్టుబడి కోసం చేసే అప్పులు అంచనాలని మించిపోతుండడంతో ఒక్కోసారి రైతు ఆత్మహథ్యలు కూడా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రైతుల పరిస్థితులని అర్దం చేసుకున్న ప్రభుత్వాలు ఎన్నో పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేలు పంట సాయం అందిస్తోంది.
ఇదే సమయంలో ఆయా రాష్ట్రాలు కూడా పంట సాయం కోసం పథకాలు తీసుకొచ్చాయి.ఈ క్రమంలోనే కిసాన్ క్రెడిట్ కార్డు అనే పథకం కూడా వచ్చింది. దీనితో.. రైతులు చాలా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక లోన్ పొందొచ్చు. అయితే దీనికి ఎవరు అర్హులు.. అప్లై ఎలా చేసుకోవాలి.. వంటి వివరాలు చూస్తే… సాగు కోసం ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఒకసారి ఈ కార్డు తీసుకుంటే ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఐదేళ్ల కాలంలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. దీనికి వడ్డీ 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది.
ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, వ్యవసాయ భూమి ఎంత ఉంది.. వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారు.దానిని బట్టే ఎంత లోన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వాస్తవంగా వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. తీసుకున్న రుణం ఏడాది లోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3 శాతం తగ్గిస్తారు. అందుకే కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 4 శాతానికి మించదు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతు మరణిస్తే.. బీమా కంపెనీ నుంచి అతని కుటుంబానికి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. ఇక శాశ్వత వైకల్యం ఉంటే రూ. 50 వేల వరకు సాయం వస్తుంది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు సేవింగ్స్ అకౌంట్, డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు అందిస్తారు. దీంట్లో పొదుపుపై వడ్డీ కూడా వస్తుంది. ఈ కార్డ్ డిట్ కార్డు కోసం అప్లై చేసుకునే రైతు వయసు 18-75 ఏళ్ల మధ్య ఉండాలి.
కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ముందుగా ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోంపేజీలో కనిపించే ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలని బ్యాంక్ ధృవీకరిస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే.. కొన్ని రోజుల్లో కేసీసీ జారీ అవుతుంది. ఆఫ్‌లైన్‌లో అయితే మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేసీసీ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. ఆ ఫారం కోసం, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి.. బ్యాంకులో సమర్పించాలి. మీ అప్లికేషన్ ఫారంను బ్యాంక్ ప్రాసెస్ చేసి.. కొన్ని రోజుల్లోనే కేసీసీ వచ్చే అవకాశం ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…