ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. వారికి కొత్తగా రెండు క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. ఎల్ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంకు రెండూ కలిసి సంయుక్తంగా ఆ కార్డులను లాంచ్ చేశాయి. లుమైన్ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సీఎస్ఎల్ ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. లుమైన్ కార్డుతో ప్రతి రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను ఇస్తారు. అదే ఎక్లాట్ కార్డుతో అయితే 4 పాయింట్లను ఇస్తారు. ఈ కార్డులను ఉపయోగించి ప్రీమియం చెల్లిస్తే రివార్డు పాయింట్లు రెట్టింపు మొత్తంలో లభిస్తాయి.
ఇక లుమైన్ కార్డుదారులు 60 రోజుల్లో రూ.10వేలు ఖర్చు చేస్తే 1000 వెల్‌కమ్ బోనస్ పాయింట్లను ఇస్తారు. ఎక్లాట్ కార్డుకు అయితే 1500 పాయింట్లను ఇస్తారు. ఇక రెండు కార్డులకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ లేదా పర్మినెంట్ డిజేబిలిటీ కవర్, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో లాస్ట్ లయబిలిటీ వంటి సదుపాయాలను అందిస్తున్నారు.
ఈ కార్డులతో ఫ్యుయల్ కోసం ఖర్చు చేస్తే 1 శాతం పన్ను రద్దు చేస్తారు. రూ.400 ఆపైన చేసే ఇంధన ఖర్చులకు ఇది వర్తిస్తుంది. రూ.3000 అంతకన్నా ఎక్కువ మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్లను సులభంగా ఈఎంఐలకు మార్చుకోవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఫీజు ఉండదు. కార్డు హోల్డర్లు ఏవైనా వస్తువులను కొంటే 3, 6, 9, 12 నెలల ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…