ప్రస్తుతం గ్యాస్ లేని ఇళ్ళంటూ ఉండదు. అయితే నెల నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రతి నెలా గ్యాస్ ధరలు పెరుగుతూ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ నెల కూడా గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
ప్రతి నెలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల కూడా గ్యాస్ ధరలు 25 రూపాయలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధరలు పెంచడంతో సామాన్యులకు ఎంతో భారంగా మారనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సిలిండర్ బుక్ చేస్తే 975 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇందులో సిలిండర్ బుకింగ్ ధర రూ.945 కాగా డెలివరీ బాయ్ కి 50 రూపాయల అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పెరిగిన ధరలను అమలు చేస్తే గ్యాస్ సిలిండర్ ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పడుతుందని చెప్పవచ్చు. ఒకటవ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.