మీరు SBI కస్టమరా.. SBI ఏటీఎం కార్డు వాడుతూ ఏటీఎం పిన్ మర్చిపోయారా.. లేకపోతే కొత్త ఏటీఎం కార్డుకు పిన్ జనరేట్ చేసుకోవాలా? అయితే ఇలా కొత్త పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. అది ఎంతో సులభతరం అయిన ప్రక్రియ. ఒకప్పుడు పిన్ కోడ్ పోస్ట్ ద్వారా మన ఇంటికి వచ్చేది. ఒకవేళ పిన్ మర్చిపోతే మళ్లీ బ్యాంకుకి వెళ్లి పిన్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ పిన్ ను ఇంట్లోనే ఆన్‌లైన్ ద్వారా ఎంతో సులభంగా పొందవచ్చు. ఎలాగంటే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్-IVRS ద్వారా తమ ఏటీఎం పిన్ కోడ్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి పిన్ ను జనరేట్ చేసుకోవడానికి కస్టమర్లు తప్పనిసరిగా బ్యాంకులో ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నంబర్ నుంచి 1800 112 211 లేదా 1800 425 3800 అనే నంబర్‌లకు కాల్ చేసి అందులో ఆప్షన్ లను ఎంచుకోవడం ద్వారా పిన్ నంబర్ జనరేట్ అవుతుంది.
ఈ నంబర్లకు ఫోన్ చేసే కన్నా ముందుగా మన ఏటీఎం కార్డు నంబర్, అకౌంట్ నంబర్ దగ్గర ఉంచుకోవాలి. ఈ నంబర్లకు ఫోన్ చేయగానే ముందుగా భాషను ఎంచుకుని డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం సర్వీసుల కోసం 2 నొక్కాలి. ఆ తరువాత ఏటీఎం పిన్ జనరేట్ చేయడం కోసం 1ని నొక్కాలి. ఈ విధంగా ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఎంతో సులభంగా మనం ఏటీఎం పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…