చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది భారత ప్రభుత్వం పలు చైనా యాప్‌లతోపాటు పబ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పబ్‌జి మొబైల్ ఇండియాగా ఆ గేమ్‌కు నామకరణం చేసి డెవలపర్లు గేమ్‌ను మళ్లీ భారత్‌లో లాంచ్ చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే త్వరలో ఈ గేమ్ మళ్లీ లాంచ్ అవబోతున్నట్లు తెలిసింది.
పబ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌కు క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చింది. దీని పేరిట ఏప్రిల్ 7వ తేదీన ఓ వెబ్‌సైట్‌ను కూడా రిజిస్టర్ చేసింది. అలాగే గేమ్‌కు సంబంధించి పలు ఇమేజ్‌లు లీకయ్యాయి. దీంతోపాటు భారత్ నుంచి ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గేమ్‌ను త్వరలోనే లాంచ్ చేస్తారని అర్థమవుతోంది.
అయితే గేమ్ లాంచింగ్ తేదీ గురించి ఇప్పటి వరకు ఆ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఈ గేమ్‌ను ఇదే నెల లేదా జూన్ నెలలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ కొత్త గేమ్‌కు కేంద్రం అనుమతులు ఇస్తుందా, గేమ్ లాంచ్ అవుతుందా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…