మార్కెట్‌లో ప్రస్తుతం మనకు రెండు రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్ ఓఎస్ కలిగిన ఫోన్లు. రెండు ఐఓఎస్ కలిగిన ఐఫోన్లు. ఆండ్రాయిడ్ ఫోన్లను అనేక రకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. కానీ ఐఫోన్లను కేవలం యాపిల్ సంస్థే తయారు చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారు ఉన్నట్లుండి ఐఫోన్ కు మారితే కష్టమే. కొద్దిగా అలవాటు పడాలి. ఇక డేటా విషయానికి వస్తే దాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
గతంలో ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఫోన్లకు మారేందుకు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. కనుక ఆండ్రాయిడ్‌లో వాడే అవే యాప్‌లు ఐఓఎస్‌లోనూ అందుబాటులో ఉంటాయి. కనుక పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కానీ వాట్సాప్ వంటి యాప్‌ల డేటాను ట్రాన్స్ ఫర్ చేయడం కష్టమవుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఇతర ఫైల్స్ ను పీసీకి కనెక్ట్ అయి అందులోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. తరువాత ఐఫోన్‌ను కనెక్ట్ చేసి అందులోకి ఆ డేటాను ఐట్యూన్స్ ద్వారా పంపించుకోవచ్చు. ఇక వాట్సాప్ డేటాను బదిలీ చేయాలంటే doctor fone అనే సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. దాన్ని పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో ఆండ్రాయిడ్ లో ఉన్న వాట్సాప్ డేటా మాత్రమే కాదు, ఇతర డేటాను కూడా ఐఫోన్‌లోకి సులభంగా పంపించుకోవచ్చు. కాకపోతే ఆ సాఫ్ట్‌వేర్ ఉచితం కాదు. డబ్బులు చెల్లించాలి. మీరు డేటా చాలా విలువైంది అని భావిస్తే ఆ సాఫ్ట్ వేర్‌ను కొనుగోలు చేసి అందులో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు డేటాను బదిలీ చేసుకోవచ్చు. లేదా టెక్నిషియన్ వద్దకు తీసుకెళ్తే కొన్ని గంటల్లో డేటాను బదిలీ చేస్తారు. కానీ ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మన డేటాను వారు తస్కరించకుండా చూసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…