ప్రముఖ వాచ్‌ల తయారీదారు టైమెక్స్ భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. టైమెక్స్ హీలిక్స్ 2.0 పేరిట ఆ వాచ్‌ను విడుదల చేశారు. ఇందులో అనేక రకాల సెన్సార్లు ఉంటాయి. టెంపరేచర్ సెన్సార్ కూడా ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లు మార్కెట్‌లో వచ్చి కొన్ని సంవత్సరాలే అయింది. కానీ టైమెక్స్ కంపెనీ రిస్ట్ వాచ్‌ల తయారీలో ఎప్పటి నుంచో పేరు గాంచింది. ఈ క్రమంలోనే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టైమెక్స్ కూడా కొన్ని నెలల కిందటే స్మార్ట్ వాచ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో భాగంగానే ఆ కంపెనీ స్మార్ట్ వాచ్‌లను తయారు చేసి అందిస్తోంది.
హీలిక్స్ 2.0 స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ వంటి అనేక రకాల సెన్సార్లు ఉన్నాయి. ఈ వాచ్ డయల్ చతురస్రాకారంలో ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా ఇస్తుంది. ఒక్క సారి చార్జింగ్ చేస్తే 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన వారికి టైమెక్స్ డాక్ ఆన్‌లైన్‌కు చెందిన సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.
ఇక ఈ వాచ్‌లో అనేక ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. టైమెక్స్ హీలిక్స్ స్మార్ట్ 2.0 వాచ్‌లో 1.55 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. పలు రకాల సెన్సార్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ 9 రోజుల వరకు వస్తుంది. 3 గంటల్లో వాచ్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. 10 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. 20 రకాలకు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో లభిస్తున్నారు. ఈ వాచ్‌కు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టిన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వాచ్ ధర రూ.3,999గా ఉంది. జూలై 26వ తేదీ నుంచి అమెజాన్‌లో ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…