BSNL 5G : మీరు ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL సిమ్ వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే మీకు 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అవును, నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. దేశంలో ప్రస్తుతం BSNLకు గాను కేవలం 3జి సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే 4జి పనిచేస్తోంది. అయితే 4జి కాకుండా ఏకంగా నేరుగా 5జి సేవలనే అందుబాటులోకి తెచ్చేందుకు BSNL కృషి చేస్తోంది. ఈ మేరకు BSNL సన్నాహాలు ప్రారంభించింది.
BSNL త్వరలోనే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు తన 5జి సేవల ద్వారా పోటీ ఇవ్వనుంది. హైస్పీడ్ డేటాతోపాటు హెచ్‌డీ క్లారిటీతో వాయిస్ కాల్స్‌ను చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. ఇక 5జి సేవలను అందించేందుకు గాను BSNL పలు స్టార్టప్‌లతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే దేశంలో కొన్ని చోట్ల 5జి ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. అందుకు గాను కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఈ ట్రయల్ రన్‌లో భాగంగా 700మెగా హెడ్జ్ బ్యాండ్ కింద 5జి సేవలను BSNL అందిస్తుంది.
ఇక ఈ ట్రయల్ రన్‌ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, బెంగళూరులోని ప్రభుత్వ ఇండోర్ కార్యాలయం, ఢిల్లీలోని సంచార్ భవన్, జేఎన్‌యూ క్యాంపస్, ఐఐటీ, ఇండియా హాబిటాట్ సెంటర్, గురుగ్రామ్‌లోని ఒక చోట, హైదరాబాద్‌లోని ఐఐటీ తదితర ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ఈ ప్రదేశాల్లోని వినియోగదారులకు ముందుగా BSNL5జి సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తారు.
అయితే BSNL గనక అనుకున్న ప్రకారం 5జి ట్రయల్స్‌ను నిర్వహించి విజయవంతం అయితే ఈ ఏడాది చివరి నుంచే దేశీయ BSNL వినియోగదారులకు 5జి సేవలు లభ్యం అవుతాయి. దీంతో ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరలకే వినియోగదారులు డేటా, వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని, వాలిడిటీని పొందుతారు. మరి దేశవ్యాప్తంగా BSNLలో 5జి సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…