చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 10వ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా వెనుకబడింది. పలువురు బ్యాట్స్‌మెన్ ప్రయత్నాలు చేసినా వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా పరుగులు చేయలేకపోయింది. దీంతో కోల్‌కతాపై బెంగళూరు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌లు అద్భుతంగా రాణించారు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో మాక్స్‌వెల్ 78 పరుగులు చేయగా, 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో డివిలియర్స్ 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, ప్యాట్ కమ్మిన్స్, ప్రసిద్ కృష్ణలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఆండ్రు రస్సెల్, ఇయాన్ మోర్గాన్‌లు ఫర్వాలేదనిపించారు. 20 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో రస్సెల్ 31 పరుగులు చేయగా, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో మోర్గాన్ 29 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో కైలీ జేమిసన్ 3 వికెట్లు పడగొట్టాడు. చాహల్, హర్షల్ పటేల్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. వాషింగ్టన్ సుందర్‌కు 1 వికెట్ దక్కింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…